టీచ‌ర్ కాదు నీచ‌ర్‌.. స్కూల్‌ను బార్‌గా మార్చాడు..!

ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నాడు.

By Medi Samrat
Published on : 26 March 2021 1:38 PM IST

The teacher who turned the school into a bar

పిల్లలకి పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నాడు. అంతేకాదు.. ఇది ప్రత్యక్షంగా చూసిన ఓ మ‌హిళ‌ వీడియో తీస్తుంటే.. బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ స‌ద‌రు ఉపాధ్యాయుడు బరితెగించి ప్రవర్తించాడు.

వివ‌రాళ్లోకెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల నందు గురువారం పాఠశాలనే బార్ గా మార్చాడు ఉపాధ్యాయుడు. పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నాడు. అదేంటి అని అడిగిన‌ విద్యార్థుల తల్లిదండ్రులను.. అసభ్యకరంగా పచ్చి బూతులు తిడుతున్నాడు. అంతేకాదు టీచ‌ర్ బాగోతాన్ని వీడియో తీస్తున్న‌ ఓ మహిళను బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది.

విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు.. కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు క్లాసులు చెప్పాల్సిన‌ సమయంలో మద్యం సేవించ‌డ‌మేకాక‌.. విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడని తెలిపారు.‌





Next Story