ఇక నుంచి ప్రతి' ఫ్రైడే,డ్రైడే'..కొత్త ప్రోగ్రామ్‌కు ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌లో దోమల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik
ఇక నుంచి ప్రతి' ఫ్రైడే,డ్రైడే'..కొత్త ప్రోగ్రామ్‌కు ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌లో దోమల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దోమల నిర్మూలనకు డీప్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ దోమల నియంత్రణ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ప్రారంభించనుంది. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ కోసం కృత్రిమ మేధస్సు శక్తితో పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ ను రాష్ట్రంలోని ఆరు ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లలో 66 ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనుంది..డ్రోన్లు, సెన్సార్లు, హీట్ మ్యాప్స్ మరియు ట్రాప్స్ వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాల సహాయంతో ఈ ప్రాజెక్ట్ ను మున్సిపల్ శాఖ పర్యవేక్షించనుంది..ఇప్పటికే చాలా దేశాల్లో ఇ సాంకేతికతను దోమలను నిర్మూలన కోసం వినియోగిస్తున్నాయి
పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో ప్రధానంగా దోమలు ఎక్కువ గా ఉండే ప్రాంతాల్లో AI శక్తితో కూడిన స్మార్ట్ దోమల సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతులతో పాటు, ఆడ, మగా దోమలను కూడా గుర్తించగలవు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో దోమల సాంద్రత పరిమితి స్థాయిని మించినప్పుడు స్మార్ట్ మస్కుటో సెన్సార్ ఆటోమేటిక్ గా హెచ్చరికలను జారీ చేస్తుంది.
ఈ విధంగా సృష్టించబడిన డేటా నిరంతరం కేంద్ర సర్వర్‌కు సమాచారం పంపుతుంది. రియల్ టైమ్ డ్యాష్‌బోర్డ్‌లో ఉంచబడుతుంది. ఇది మరింత నిశితంగా పర్యవేక్షణను అవకాశం కలిగిస్తుంది. ప్రభావితమైన ప్రాంతాల్లో వేగవంతమైన ఫాగింగ్ చర్యలు చేసేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం తక్కువ ప్రభావం చూపుతున్న బ్లైండ్ స్ప్రేయింగ్ ప్రక్రియకు బదులుగా దోమల సమర్థవంతమైన నియంత్రణ కోసం డేటా ఆధారిత విధానం అనుసరించబడుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సెన్సార్లు తో దోమల ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించనున్నారు.