పులివర్తి నానిని విచారించిన సిట్ అధికారులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

By M.S.R  Published on  20 May 2024 9:47 AM IST
పులివర్తి నానిని విచారించిన సిట్ అధికారులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులకు.. వైసీపీ అనుచరులకు మధ్య జరిగిన గొడవ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన గురించి అధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల కమీషన్ సిట్ ను ఏర్పాటు చేశారు.

పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో 2గంటకు పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించానని పులివర్తి నాని తెలిపారు. అధికారులు ఘటనకు ముందు, తర్వాత జరిగిన విషయాల గురించి కూడా అడిగారని తెలిపారు. మా కార్లకు ఉన్న కెమెరాల పుటేజీని.. ఫోటో ఆధారాలను అధికారులకు అందజేశామని తెలిపారు పులివర్తి నాని. ప్రత్యర్థులు సమ్మెటతో దాడి చేయలేదని ఆరోపించడం అవాస్తవమని అన్నారు. సాక్ష్యాలు ఉన్నాయని.. సిట్ అధికారులు అందజేశానన్నారు. దాడికి వెనుక ఉన్న కీలక వ్యక్తులను శిక్షించాలని కోరానన్నారు. ఇక ఈ దాడికి సంబంధం లేని, తిరుమలకు చెందిన ముగ్గురుని అరెస్ట్ చేశారని.. సిట్ అధికారులు ఈ విషయాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.

Next Story