వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు

By -  Knakam Karthik
Published on : 26 Jan 2026 11:30 AM IST

Andrapradesh, Kurnool, Nandyala, Srisailam Mallanna Temple, Devotees Rush

వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనను అధికారులు నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర, దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా ఉదయం 7:30 అనంతరం ర 11.30కు రాత్రి 9 గంటలకు మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Next Story