ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. నిందితుడు అరెస్ట్‌

మే 28న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు

By Medi Samrat  Published on  29 May 2024 5:29 PM IST
ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. నిందితుడు అరెస్ట్‌

మే 28న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో జల్లెడ పట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంతో పాటుగా మంత్రి సీతక్క ఇంట్లో ప్రతి గదిని తనిఖీ చేశారు.గార్డెన్ ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఆలయం అన్ని పరిసరాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు. ఈ క్రమంలో బాంబ్ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. ఈ బెదిరింపులకు పాల్పడింది గుంటూరుకు చెందిన రామకృష్ణ అని తేలింది. భార్యతో గొడవ పడి మద్యానికి బానిసగా మారాడని తెలుస్తోంది. భార్య లేదనే బాధలో రామకృష్ణ ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Next Story