ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం న‌మోదు.. ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

By Medi Samrat  Published on  15 May 2024 6:30 AM IST
ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం న‌మోదు.. ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాతో కలుపుకొని ఏపీలో పోలింగ్ 82.37 శాతానికి చేరింది. అన్నిచోట్లా పోలింగ్‌ ముగిశాక ఓటింగ్ 81.30 శాతంగా ఉండగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 1.07 శాతంతో కలుపుకొని మొత్తం పోలింగ్‌ 82.37 శాతానికి చేరిందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత ఈసీ తుది గణాంకాలను అధికారికంగా ప్రకటించనుంది. ప్రాథమిక పోలింగ్ 82.37 శాతం ఏపీ చరిత్రలో అత్యధిక ఓటింగ్ శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2014లో 78.90శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80శాతం పోలింగ్ నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4లక్షల 44వేల 218 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో గమనిస్తే పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,95,003 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Next Story