ఏపీ హైకోర్టు సీజేలుగా పనిచేసిన వారికి రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్ కల్పించిన ప్రభుత్వం

ఏపీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌లకు రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By Knakam Karthik  Published on  28 Jan 2025 11:30 AM IST
Andrapradesh, Ap High Court, State Guest Protocol, Who served as CJs of AP High Court

ఏపీ హైకోర్టు సీజేలుగా పనిచేసిన వారికి రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్ కల్పించిన ప్రభుత్వం

ఏపీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌లకు రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌లుగా పని చేసిన న్యాయమూర్తులకు రాష్ట్రంలో పర్యటించే సమయంలో ఐదు రోజుల పాటు రాష్ట్ర అతిథులుగా ప్రోటోకాల్ కల్పించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జిలకు కూడా రాష్ట్ర అతిథులుగా ప్రోటోకాల్ కల్పించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story