రాష్ట్రంలో మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మెప్మా రిపోస్స్ పర్సన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
రాష్ట్రంలో మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
పొదుపు సంఘాల్లో మహిళల అభివృద్ధి కోసం కృషిచేస్తున్న మెప్మా రిపోస్స్ పర్సన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్పీలు ఎవరైనా మూడేళ్ల వరకే పనిచేయాలనే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులను రద్దు చేస్తూ పట్టణాభివృద్ధిశాఖ మెమో నెంబరు 2822995/యుబిఎస్/2025 తేదీ 02.07.2025ను విడుదల చేసింది. ఇప్పటి వరకూ పని భద్రత లేదన్న భయంతో గడిపిన ఆర్పీలు ఈ ఉత్తర్వులతో ఆనందోత్సాహాలకు గురయ్యారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, మెప్మా ఎండీ శ్రీ తేజ్ భరత్‌లను విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపిందని.... జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు. ఇప్పటి వరకూ ఉద్యోగ భద్రతపై అనుమానంతో విధులు నిర్వహించామని...ఇక ముందు అటువంటిదేమీ లేకుండా ధైర్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. పట్టణాల్లో ఉన్న పొదుపు సంఘాల్లో మహిళల ఆర్థికాభివృద్ధిలో మెరుగైన పనితీరు, ఫలితాలు చూపిస్తామని ఆనందం వ్యక్తం చేశారు.