ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో రేషన్‌ కార్డులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

By అంజి  Published on  9 Oct 2024 1:02 AM GMT
AP government, ration cards, APnews

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో రేషన్‌ కార్డులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా.. కొత్తగా రేషన్‌ కార్డుల జారరీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ముఖ్య అంశంగా ఎంచుకుంది. ఈ మేరకు గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన ధాన్యం బకాయిలు రూ.1674.40 కోట్ల మొత్తాన్ని ఏన్డీయే సర్కార్‌ చెల్లించింది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రూ.1000 కోట్లు, రెండో విడతలో రూ.674.40 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అటు వెహికల్స్‌ ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీపై ప్రభుత్వం మరో కీలక డెసిషన్‌ తీసుకుంది. 6 వేల రేషన్‌ డీలర్లను భర్తీ చేయనున్నారు. .అలాగే 4 వేలకుపైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించితే రేషన్‌ కార్డులకు అర్హులు కాదని గత ప్రభుత్వం నిర్ణయింది. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దురమయ్యాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Next Story