బియ్యం, కందిపప్పు ధరలను మరో దఫా తగ్గించిన ఏపీ ప్ర‌భుత్వం

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించిన‌ట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు

By Medi Samrat
Published on : 31 July 2024 5:30 PM IST

బియ్యం, కందిపప్పు ధరలను మరో దఫా తగ్గించిన ఏపీ ప్ర‌భుత్వం

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించిన‌ట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కీ, బియ్యం రూ.48 నుంచి రూ.46కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.47కీ తగ్గించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

రైతు బజార్లలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో గురువారం నుంచి తగ్గింపు ధరల్లో విక్రయిస్తారని.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి అన్నారు.

Next Story