Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ

రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 2:17 PM IST

Andrapradesh, Cyclone Montha, AP Disaster Management Authority

Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ

అమరావతి: రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నట్లు తెలిపింది. తుపాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి. అప్రమత్తంగా ఉండండి..అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు.

Next Story