గవర్నర్‌ గారు.. పచ్చమూకల అరాచకాలను అడ్డుకోండి : జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on  6 Jun 2024 2:10 PM IST
AndhraPradesh, TDP, attack, YS Jagan

ఏపీలో టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం: వైఎస్‌ జగన్‌ 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. గౌరవ గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని వైఎస్‌ భరోసా ఇచ్చారు.

Next Story