క‌ర్నూలు జిల్లాలో దారుణం.. రామాల‌యం ధ్వ‌జ‌స్తంభాల ధ్వంసం

Temple dwajasthambam vandalized in Dhone.ఏపీలో దేవాల‌యాల‌పై దాడులు మ‌ళ్లీ వెలుగుచూస్తున్నాయి. రామాల‌యం ధ్వ‌జ‌స్తంభాల ధ్వంసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 3:04 AM GMT
Temple dwajasthambam vandalized in Dhone

ఏపీలో దేవాల‌యాల‌పై దాడులు మ‌ళ్లీ వెలుగుచూస్తున్నాయి. గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు రాష్ట్రంలో ఎక్క‌డో ఒక చోట ఆల‌యాల‌పై దాడులు జ‌రిగాయ‌నే వార్త‌లను చూసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మ‌రో ఆల‌యంపై దాడులు జ‌రిగాయి. క‌ర్నూలు జిల్లాలోని డోన్ మండ‌లంలోని వెంక‌ట‌నాయునిప‌ల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీతారామ స్వామి ఆల‌యానికి చెందిన రాతి స్తంభాల‌ను గుర్తు తెలియని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ముక్క‌లైన స్తంభాల‌ను చూడ‌డంతో.. గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంద‌రు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇస్తామని.. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని స‌ర్పంచ్ అభ్య‌ర్థి ఒక‌రు కోరారు. అయితే.. ఇందుకు మ‌రో వ‌ర్గం అనుమ‌తించ‌లేదు. దీంతో ఎన్నిక‌లు జ‌రిగాయి. గెలిచిన అనంత‌రం ఇచ్చిన మాట ప్ర‌కారం రూ.30ల‌క్ష‌లు ఇచ్చారు. అయితే.. ఇప్పుడా ఆలయంపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
Share it