ఖమ్మంకు చెందిన ఓ వ్యాపారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ లిక్కర్ దుకాణాల లాటరీలో నాలుగు మద్యం షాపుల లైసెన్స్‌లను గెలుచుకున్నాడు. సోమవారం నిర్వహించిన లాటరీ డ్రాలో కొండపల్లి గణేష్ అనే వ్యాపారికి పుట్టపర్తిలో ఒకటి, నంద్యాలలో మూడు మద్యం దుకాణాలు దక్కాయి. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా 3,396 మద్యం దుకాణాలకు దాదాపు 90,000 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో పాల్గొనేందుకు ప్రతి దరఖాస్తుదారుడు రూ.2 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గచ్చిబౌలిలోని మై హోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే కొండపల్లి గణేష్ ఇటీవల లడ్డూ వేలం పాటలో పాల్గొని రూ. 29 లక్షలతో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. ఇది మునుపటి సంవత్సరం వేలం కంటే రూ. 4 లక్షలు ఎక్కువ రావడం విశేషం. తాజాగా లిక్కర్ షాపు లాటరీలో గణేష్‌కు షాపులు దక్కడంతో అంతా దేవుడి దయ అని అంటున్నారు.