సీఎం జగన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం
Technical fault in CM Jagan's plane. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.
By Medi Samrat Published on 26 April 2023 5:36 PM ISTఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నార్పల నుంచి పుట్టపర్తికి సీఎం జగన్ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన రోడ్డు మార్గాన పుట్టపర్తికి వెళ్లారు.
జగనన్న వసతి దీవెన నిధులను అనంతపురం జిల్లా నార్పలలో సీఎం జగన్ విడుదల చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఇచ్చారని.. ఆయన మాటలు వింటే పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయని అన్నారు. ఈ పంచతంత్రం కథల్లో చంద్రబాబు నాయుడిని పులితో పోల్చారు. నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని వేటాడే శక్తి లేక నాలుగు నక్కల్ని తోడేసుకుందని అన్నారు. చంద్రబాబు అనే పులి మోసం గురించి తెలిసిన వారు ఆయన దగ్గరకు రారని.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కదా అని ఎవరైన నమ్మి వెళ్తే మడుగులో పడి బురదలో ఇరుక్కుంటారని.. ఆ కథలో బురదలో పడ్డ వారిని పులి చంపుకు తింటుందని, బాబు నైజం కూడా అలాంటిదేనని అన్నారు.
జగనన్న వసతి దీవెన కింద రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్ 26న రోజు జమ చేసిన రూ.912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ అయ్యాయి.