ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం నివాసంలో టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు సీఎంకి వివరించారు.
ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. మహీంద్ర గ్రూప్ విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించారు.