ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులు బాగా చదవడం లేదని లేదా హోంవర్క్ చేయలేదని బెత్తంతో కొట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 3న ఈ ఘటన జరగ్గా, మరుసటి రోజు ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని డి పాల్ స్కూల్ కరస్పాండెంట్ బెన్హర్ 'చదువులో రాణించలేదని' పిల్లలను నిర్దాక్షిణ్యంగా కొట్టాడు.
హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో కొట్టాడని విద్యార్థులు తెలిపారు. 5వ తరగతి విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఆత్మకూర్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 (స్వచ్ఛందంగా ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడం) కింద ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినప్పటి నుండి.. పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై మండల విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించింది.
నాగ ధ్రువ తేజను కొట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరో ఇద్దరు విద్యార్థుల సంఘటన వెలుగుచూసింది. ఇంకా ఎంత మంది విద్యార్థులు దెబ్బలు తినిఉంటారో అన్నది డిపాల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మధ్య కొంత మంది ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కఠిన శిక్షలు వేస్తూ.. విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నారు.