టీడీపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 118 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో టీడీపీకి 94 సీట్లు, జనసేనకు 24 సీట్లు కేటాంచారు. అయితే పలువురు టీడీపీ నేతలకు మొండిచేయి చూపించారు చంద్రబాబు నాయుడు.
పెనుగొండ నియోజకవర్గ టీడీపీ టికెట్ ను చంద్రబాబు నాయుడు సవితమ్మకు కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని ఇన్ని రోజులూ ఆశించారు. టీడీపీ నుండి ప్రకటన రావడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ పార్థసారథిలో ఇవ్వనందుకు ఫ్లెక్సీలను తగలబెట్టారు ఆయన అభిమానులు. పెనుకొండ లోని బీకే పార్థసారథి ఇంటి ముందు తేదేపా ఫ్లెక్సీలు తగలబెట్టింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు కేటాయించింది టీడీపీ. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీకి దింపింది. అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పీలా గోవింద్ సమావేశం నిర్వహించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గోవింద్ అనుచరులు కోరారు.