Andrapradesh: పులివెందుల జడ్పీటీసీ పీఠం..టీడీపీ కైవసం
ఏపీ పాలిటిక్స్‌లో అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూసిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.
By Knakam Karthik
Andrapradesh: పులివెందుల జడ్పీటీసీ పీఠం..టీడీపీ కైవసం
ఏపీ పాలిటిక్స్‌లో అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూసిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొదటిసారి టీడీపీ పులివెందులలో విక్టరీ సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 5 వేల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సతీమణి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో హోరాహోరీగా ఈ పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ కనిపించింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థిలో బరిలోకి దిగారు.. ఒంటిమిట్టలో11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది.
పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండులో పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు, పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్‌కు హాజరుకావడం లేదన్నారు. పులివెందులలో 11మంది అభ్యర్థులు పోటీచేసినా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిల మధ్య పోటీ జరిగింది. ఒంటిమిట్టలో కూడా 11మంది బరిలో ఉన్నా.. టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది.