ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగియ‌గా.. రేపు మూడోవిడత జరుగ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. అంతేకాదు ప్ర‌తిప‌క్ష టీడీపీకి ప‌ట్టున్న‌ అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ పంచాయతీలు వైసీపీ సొంతం అయ్యాయి.

అయితే.. ఎన్నిక‌ల్లో ఓటమిపాలైన అనంత‌పురం జిల్లాకు చెందిన‌ టీడీపీ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. ఓటమిని జీర్ణించుకోలేక పోయిన‌ టీడీపీ అభ్యర్థి ఈడిగ నాగేంద్రప్ప ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జ‌రిగిన ఘ‌ట‌న‌తో టీడీపీ శ్రేణులు, గ్రామ‌స్తులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


సామ్రాట్

Next Story