అలిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఆదివారం నెల్లూరులో జరిగిన అధికారిక సమావేశంలో అవమానం జరిగిందంటూ వాకౌట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 7:30 PM IST
అలిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఆదివారం నెల్లూరులో జరిగిన అధికారిక సమావేశంలో అవమానం జరిగిందంటూ వాకౌట్ చేశారు. నెల్లూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ సమక్షంలో జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ సమావేశంలో తనకు అవమానం జరిగిందని భావించారు. నెల్లూరు రూరల్ రెవెన్యూ డివిజన్ అధికారిణి ప్రత్యూష పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరుల పేర్లను ప్రకటించారు. అయితే ఆమె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరును పలకలేదు. దీంతో ఆగ్రహించిన ప్రభాకర్ రెడ్డి వేదికపై నుంచి లేచారు. తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి హఠాత్తుగా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఎంపీతో కలిసి వేదిక నుంచి దిగిపోయారు. ఈ ఘటనపై రాంనారాయణరెడ్డి అధికారుల తీరును తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్‌, ఉన్నతాధికారులను ఆదేశించారు.

Next Story