నిమ్మల రామానాయుడు అరెస్ట్

పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ-టీడీపీ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

By Medi Samrat  Published on  15 Nov 2023 10:30 AM GMT
నిమ్మల రామానాయుడు అరెస్ట్

పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ-టీడీపీ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. బుధవారం ‘పాలకొల్లు చూడు’ పేరుతో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంజార్జ్ గొడాల గోపి కూడా ‘నిజం చెబుతాం’ పేరుతో కార్యక్రమం చేపట్టడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు ఇరు పార్టీల నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడును గృహ నిర్భందం చేశారు. పోలీసులను తప్పించుకుని ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఎమ్మెల్యే కింద పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు.

మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నిరసనకు పోటీగా వైఎస్సార్‌సీపీ కూడా పోటీగా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. టిడ్కో ఇళ్ల వైఎస్సార్‌సీపీ నాయకులు చేరుకున్నారు.

Next Story