గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌ల బృందం

ఏపీ గవర్నర్‌ను టీడీపీ బృందం క‌ల‌వ‌నుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ

By Medi Samrat  Published on  18 Oct 2023 3:15 PM IST
గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌ల బృందం

ఏపీ గవర్నర్‌ను టీడీపీ బృందం క‌ల‌వ‌నుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ రాజ్‌భవన్ లో గవర్నర్ అబ్ధుల్ న‌జీర్‌తో టీడీపీ నేత‌ల‌ బృందం స‌మావేశ‌మ‌వ‌నుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్, వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, శాసన మండలి సభ్యుడు పరుచూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ త‌దిత‌రులు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. ఈ భేటీలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రంలో తాజా పరిణామాలను టీడీపీ నేత‌ల బృందం గవర్నర్‍కు వివరించనున్న‌ట్లు టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు.

Next Story