'గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?'.. వైఎస్‌ జగన్‌పై సోమిరెడ్డి ఫైర్‌

బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తిపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

By అంజి  Published on  18 Jun 2024 5:04 AM GMT
TDP leader Somireddy, YS Jagan, APnews, EVM, Elections

'గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?'.. వైఎస్‌ జగన్‌పై సోమిరెడ్డి ఫైర్‌

బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తిపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి వైఎస్‌ జగన్‌ కోలుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎలాన్‌ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు.

మరోవైపు బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించాలన్న జగన్‌ ట్వీట్‌ నేపథ్యంలో 2019లో ఆయన ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడిన వీడియోను టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాయి. ''80 శాతం మంది ఓట్లు వేశారు. తాము వేసిన పార్టీకి ఓటు పడింది కాబట్టే పోలింగ్‌ కేంద్రాల నుంచి సంతృప్తితో బయటికొచ్చారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నేను వెళ్లి ఫ్యాన్‌కి ఓటేస్తే.. వీవీప్యాట్‌లో సైకిల్‌ గుర్తు కనిపిస్తే ఎందుకు ఊరుకుంటా?'' అని గతంలో జగన్‌ మాట్లాడిని వీడియోను టీడీపీ, జనసేన పోస్టు చేస్తున్నాయి.

సీఎం జగన్‌ ట్వీట్‌..

అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు అన్నీ ఈవీఎంలతో కాకుండా, బ్యాలెట్‌తో ఓటింగ్‌ నిర్వహిస్తున్నాయని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని జగన్‌ అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్టు కనిపించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story