గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తాం

TDP Leader Divyavani Fires On Kodali Nani. గుడివాడ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ఎమ్మెల్యే కొడాలి నాని కంచుకోట అని మనకు తెలిసిపోతుంది

By Medi Samrat  Published on  20 May 2022 11:01 AM GMT
గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తాం

గుడివాడ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ఎమ్మెల్యే కొడాలి నాని కంచుకోట అని మనకు తెలిసిపోతుంది. అయితే ఈ ప్రాంతంలో తెలుగుదేశం త్వరలోనే ప్రభంజనం సృష్టించబోతోందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామని టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి పేర్కొన్నారు. గుడివాడ అంటే అన్న ఎన్టీఆర్ పేరు గుర్తుకు వచ్చేదని.. నేడు దానిని క్యాసినోవాడగా మాజీ మంత్రి కొడాలి నాని మార్చాడన్నారు. రాజకీయం కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే, పంచలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు అభివృద్ధి చెయ్యాలని దివ్యవాణి సూచించారు.

కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడు :

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తాడా? అని విమర్శించారు. శ్రీకాకుళం వచ్చి సన్న బియ్యం ఇస్తానని, రెండేళ్ళ తర్వాత మాట మార్చిన ఘనుడు నాని అని విమర్శించారు. పేకాట క్లబ్‌ నడిపి, క్యాసినో నిర్వహిస్తూ డబ్బులు కుప్పేసుకున్న చరిత్ర నానిది. నాపై11 కేసులు పెట్టారు.. ఈ వయసులో నాపై రేప్‌ కేసు పెడ్డడం బాధాకరంగా ఉందన్నారు. నేను ఎవరికి భయపడే రకం కాదు. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్న జగన్‌ కు రోజులు దగ్గరపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు.Next Story
Share it