చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు వైసీపీ చేసింది, అందరి సంగతి తేలుస్తాం..బుద్ధా వెంకన్న వార్నింగ్

జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా పరిపాలన చేశారని టీడీపీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 19 March 2025 1:45 PM IST

Andrapradesh, Tdp Buddha Venkanna, Ysrcp, Jagan, Peddireddy

చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు వైసీపీ చేసింది, అందరి సంగతి తేలుస్తాం..బుద్ధా వెంకన్న వార్నింగ్

జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా పరిపాలన చేశారని టీడీపీ బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కలిసి కొత్త స్కాం చేశారు. మద్యం అడ్డుపెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గూరు పంచుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. చిత్రగుప్తుడు కూడా రాయలేనన్ని పాపాలు చేశారు. మద్యం, మైనింగ్‌లో మీరు దోచుకున్న దోపిడీతో డబ్బు మదం పట్టింది. ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారు. మీ పాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారు. పుంగనూరులో చంద్రబాబును అడ్డుకుని దాడి చేయించారు. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా మరణాలు వంద శాతం ఉన్నాయని చెప్పారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానిది కాదా..అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు.

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కామ్ లేదు, చేయని కబ్జా లేదు. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలి. చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే. మీరు అసలు రోడ్ల మీదకే వచ్చేవారా? గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వ్యవహరిస్తే, అందరి సంగతి తేలుస్తాం. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా? అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం మాల వేయడం కాదు, అవనీతి చేయకుండా, నిజాయితీగా బతకాలి. ఈ మద్యం కుంభకోణం గురించి ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. రేపు తండ్రీ, కొడుకులు అరెస్టయితే ప్రభుత్వంపై గగ్గోలు పెడతారు. తప్పు చేసిన ఎవ్వరైనా జైలుకు వెళ్లక తప్పదు. నా ఛాలెంజ్‌కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలి..అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.

Next Story