టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాబూ రాజేంద్రప్రసాద్‌ను

By అంజి  Published on  7 Jun 2023 7:00 AM GMT
TDP leader, Babu Rajendra Prasad, heart attack, APnews

టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాబూ రాజేంద్రప్రసాద్‌ను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రాజేంద్రప్రసాద్‌కు యాంజియోగ్రామ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారని, వ్యాధి నిర్ధారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. బాబూ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్లతో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని, ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.

Next Story