టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు

By M.S.R  Published on  16 May 2024 4:47 AM GMT
టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొనకళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఆరా తీశారు. 2009, 2014లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొనకళ్ల ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కొనకళ్లకు టికెట్ దక్కలేదు. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలశౌరి కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

ప్రస్తుతం కొనకళ్ళ నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు కార్యకర్తలు ఆకాంక్షిస్తూ ఉన్నారు.

Next Story