APPolls: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ రెండో జాబితా విడుదలైంది.
By అంజి Published on 14 March 2024 1:09 PM IST
APPolls: టీడీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో ఈ జాబితాను చంద్రబాబు రిలీజ్ చేశారు. చంద్రబాబు కొన్ని రోజుల క్రితం టీడీపీ మొదటి లిస్ట్‌లో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.
''వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా అన్నారు.
సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని 17 పార్లమెంట్, 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా, బీజేపీ ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయనుంది.
#AndhraPradeshElections2024 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల pic.twitter.com/spTY2a32d1
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 14, 2024