జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ

జనసేన పార్టీతో సమన్వయం కోసం టీడీపీ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.

By Medi Samrat  Published on  15 Oct 2023 8:00 PM IST
జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ

జనసేన పార్టీతో సమన్వయం కోసం టీడీపీ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. టీడీపీ -జనసేన కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీ తో సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ తరపున ఇప్పటికే ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.




Next Story