'సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?'.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

By అంజి  Published on  3 March 2024 6:01 AM GMT
TDP, Chandrababu, CM Jagan, APnews

'సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?'.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి.. రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం ఏంటని ఎక్స్‌ వేదిగా సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని, బాధకరం, సిగ్గుచేటు అని అన్నారు.

''రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు....తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!'' అని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

''గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యాను. ఎపిని అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైసిపి మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? ఏపీ సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్పిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనాకేంద్రాన్ని తాకట్టుపెట్టలేదు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయస్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదు... మీరైనా చెప్పండి ప్లీజ్!!'' అంటూ టీడీపీ నేత నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

Next Story