పల్నాడు ఎస్పీని వెంటనే తొలగించాలి : చంద్రబాబు

Tdp Chief Chandrababu Naidu Fires On Palnadu SP Ravishankar Reddy. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు

By Medi Samrat  Published on  18 Dec 2022 8:00 PM IST
పల్నాడు ఎస్పీని వెంటనే తొలగించాలి : చంద్రబాబు

పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులకు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి సహకరిస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని.. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవొంపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి.. మాచరల్లో వైసీపీ అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీని వెంటనే తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమం జరుగుతుండగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో బాధితులనే నిందితులుగా చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా ఎస్పీ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.






Next Story