సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు ఎంపీలు.. ఎందుకంటే..

Tamilnadu MPS Meet With AP CM Jagan. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జగన్‌ను సోమ‌వారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో

By Medi Samrat
Published on : 11 Oct 2021 9:22 PM IST

సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు ఎంపీలు.. ఎందుకంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జగన్‌ను సోమ‌వారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో తమిళనాడు ఎంపీలు కలిశారు. సీఎంను తమిళనాడు రాష్ట్రం ఉత్తర చెన్నై లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ కళానిథి వీరాస్వామి, రాజ్యసభ సభ్యుడు టిఎస్‌కే ఇళం గోవన్‌లు క‌లిశారు. ఈ భేటీలో నీట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాసిన లేఖను సీఎం వైఎస్‌. జగన్‌కు అందించారు తమిళనాడు ఎంపీలు.

నీట్‌ అడ్మిషన్‌ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీఎం స్టాలిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పి నడుపుకొంటున్న మెడికల్‌ కాలేజీల అడ్మిషన్‌ల విధానంలో కేంద్రం చొరబాటును వ్యతిరేకిస్తున్నామని, దీనికోసమే బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నాయకుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ రాసినట్లు తమిళనాడు ఎంపీలు ఏపీ సీఎం వైఎస్‌. జగన్‌కు వివరించారు.


Next Story