Andhra Pradesh : ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు

By Medi Samrat
Published on : 2 April 2025 3:26 PM IST

Andhra Pradesh : ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, బిటి నాయుడు, కొణిదల నాగబాబు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌లచే బుధవారం శాసన మండలి ఛైర్మ‌న్ మోషేన్ రాజు శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ చాంబరులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కె.అచ్చన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉప కార్యదర్శి రాజ్ కుమార్, ఇతర అధికారులు, పలువురు ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story