ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాల స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుండి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లో 4.5 కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. స్వామిత్వ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రాపర్టీ టైటిల్స్ ఇవ్వాలని కేంద్రంలోని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీలోని 45 లక్షల ఆస్తులకూ హక్కు పత్రాలు అందనున్నాయి. గ్రామాల్లో ఇళ్లు, ఆస్తులకు, స్థలాలకు ఆస్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దీంతో ప్రాపర్టీ టైటిలతో క్రయవిక్రయాకు లోన్లకు వీలు కలగనుంది.