బాలిక ఆత్మహత్య కేసులో సస్పెండ్ అయిన టీడీపీ నేతకు జీవిత ఖైదు
14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతకు ప్రత్యేక
By అంజి Published on 27 April 2023 8:09 AM GMTబాలిక ఆత్మహత్య కేసులో సస్పెండ్ అయిన టీడీపీ నేతకు జీవిత ఖైదు
14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతకు ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 50 ఏళ్ల వినోద్ కుమార్ జైన్‌కు పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ .రజినీ ఆయనకు రూ.3 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ జరిమానా మొత్తంలో బాలిక కుటుంబానికి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు. లైంగిక వేధింపులు తట్టుకోలేక, బాలిక జనవరి 29, 2022న ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆ తర్వాత పోలీసులు ఆమె బెడ్‌రూమ్ నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో, 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను రాసింది. అదే భవనంలో నివాసం ఉంటున్న వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణంగా ఆమె జీవితం బలైపోయింది. బాలిక తాత ఫిర్యాదు మేరకు పోలీసులు వినోద్ జైన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 305, 306, 354, 509, 506, సెక్షన్ 8, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, అతనిని అరెస్టు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసిన వినోద్ జైన్‌ను టీడీపీ సస్పెండ్ చేసింది. నిందితులు రెండు నెలలుగా బాలికను అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కేసు దర్యాప్తులో తేలింది. అపార్ట్‌మెంట్‌లో వినోద్ జైన్ రోజూ వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తన సూసైడ్ నోట్‌లో రాసింది. భయం, అవమానం కారణంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదని బాధితురాలు తన సూసైడ్ నోట్‌లో రాసింది.
నిందితుడు ఫిబ్రవరి 2022 నుండి జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో 20 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను నమోదు చేశారని, సాక్ష్యాధారాల ఆధారంగా, సాక్షులను విచారించిన తర్వాత, కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిందని పోలీసులు తెలిపారు.