ఫోర్జరీ కేసులో అయ్యన్న పాత్రుడు దర్యాప్తున‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌

Supreme Court On Ayyannapatrudu Forgery Case. ఫోర్జరీ కేసు వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

By M.S.R  Published on  27 Feb 2023 3:47 PM IST
ఫోర్జరీ కేసులో అయ్యన్న పాత్రుడు దర్యాప్తున‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌

ఫోర్జరీ కేసు వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్‌ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని.. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నర్సీపట్నంలో తన ఇంటిని నిర్మించే సమయంలో ఎన్వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ చేశారని ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టును అయ్యన్న ఆశ్రయించగా.. కేసు విచారణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.


Next Story