తిరుమల లడ్డూ వివాదం.. ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది

By Medi Samrat  Published on  8 Nov 2024 5:15 PM IST
తిరుమల లడ్డూ వివాదం.. ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామాజిక కార్యకర్త, ‘గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్’ సంస్థ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. కేఏ పాల్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దేవాలయాలు, గురుద్వారాలు మొదలైన వాటి కోసం ప్రత్యేక రాష్ట్రాలను సృష్టించాల్సి ఉంటుందని, నిర్దిష్ట రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రాన్ని సృష్టించమని మేము నిర్దేశించలేమని బెంచ్ పేర్కొంది.

తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్‌ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని ఆ పిటిషన్‌లో కేఏ పాల్‌ కోరారు. కేవలం 744 మంది కేథలిక్‌లు ఉన్న వాటికన్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని, తిరుపతిని కూడా ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని కోరారు.

Next Story