తిరుమ‌ల‌ లడ్డూ వివాదం .. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు పేర్కొంది

By Medi Samrat  Published on  30 Sept 2024 2:32 PM IST
తిరుమ‌ల‌ లడ్డూ వివాదం .. ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు కూడా పలు ప్రశ్నలు సంధించింది. పరీక్షించిన నెయ్యి తిరస్కరణకు గురైనట్లు ల్యాబ్ రిపోర్టులో తేలిందని కోర్టు పేర్కొంది. అంతే కాకుండా సిట్ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత పత్రికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు ఫలితాలు వెలువడేంత వరకు ప్రెస్‌కి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదిస్తూ.. తాను భక్తుడిగా అక్కడికి వచ్చానని.. ప్రసాదంలో కలుషితం కావడంపై పత్రికల్లో చేసిన ప్రకటనలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అన్నారు. ఇది అనేక ఇతర సమస్యలకు దారితీయవచ్చు.. మత సామరస్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇది ఆందోళన కలిగించే అంశం. దేవుడి నైవేద్యాలపై ఏదైనా ప్రశ్నార్థకం ఉంటే విచారణ చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ఆలయంలో ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై తీవ్ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

Next Story