పవన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన కార్యకర్తలు
ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla
పవన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన కార్యకర్తలు
ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సీఎం జగన్ పై రాయితో దాడి సంఘటన తర్వాత మరో మారు ఇలాంటిదే ఇంకోటి జరిగింది. ఈ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాయిని విసిరారు. మరుసటి రోజే రాయి విసిరిన ఘటన చోటుచేసుకోవడంతో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్‌కు రాయి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలోని తెనాలిలో వారాహి వాహనంలో యాత్ర కొనసాగించారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని ఓ వ్యక్తి పవన్ కల్యాణ్‌పై రాయిని విసిరేశాడు. ఆ రాయి పవన్ కల్యాణ్‌కు తగలకుండా కొంతదూరంలో పడింది. ఈ సంఘనటతో సెక్యూరిటీ సిబ్బందితో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు. వెంటనే రాయి విసిరిసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దీఈనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఎందుకు విసిరేశాడు..? దీని వెనుక ఎవరైన ఉన్నారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
శనివారం సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అయితే.. ఆ రాయి సీఎం జగన్‌కు తగలడంతో తలకు గాయం అయ్యింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జగన్‌పై దాడి కేసు విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ సీపీ క్రాంతి రానా టాటా చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మురంగా చేస్తున్నామని విజయవాడ సీపీ అన్నారు.