గుడ్‌న్యూస్.. 1.18 లక్షల టిడ్కో గృహాల ప్రారంభానికి డేట్ ఫిక్స్..!
వచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 23 Dec 2024 5:13 PM ISTవచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 44 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు మరియు టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్స్ గా మిగిలి పోయిన టిడ్కో గృహాలను పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెల్పారన్నారు. 2014-19 మద్యకాలంలో కేంద్ర ప్రభుత్వంచే 7,01,481 టిడ్కో గృహాలను మంజూరు చేయించి, వాటిలో 5.00 లక్షల గృహాలకు పరిపాలనాపరమైన అనుమతులను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిలో 4,54,706 గృహాలను గ్రౌండ్ చేయడం జరిగింది. అందులో 2019 నాటి 3,13,832 గృహా నిర్మాణాలను ప్రారంభించడం జరిగింది. ప్రతి యూనిట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.3.90 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించగా, అందులో రూ.1.90 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయించడం జరిగిందన్నారు. అదే విధంగా లబ్దిదారుని వాటగా చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వం అదికారంలోకి వచ్చి ఈ ప్రక్రియను అంతా గందరగోళం చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం టెండర్లు పిలిచి నిర్మాణానికి చేపట్టిన 4,54,706 గృహాలలో కేవలం 2,61,640 గృహాలను మాత్రమే గత ప్రభుత్వం చేపట్టి మిగిలిన వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. ఆ చేపట్టిన గృహాలను కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఈ గృహాలలో దాదాపు 77 వేల గృహాలను తమ ప్రభుత్వమే పూర్తి చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు మంజూరు చేసిన గృహాలపై గత ప్రభుత్వం బ్యాంకు ఋణాలను తీసుకుని, ఆ సొమ్మును డైవర్టు చేయడం జరిగిందన్నారు. ఫలితంగా ఆయా గృహాలు నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్ట్సుగా మిగిలిపోయాయన్నారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే రూ.102 కోట్లు చెల్లించాల్సి ఉంది, ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెల్పారన్నారు. వీటిలో దాదాపు 1.18 లక్షల గృహా నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ 12 కల్లా పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
రూ.2,723 కోట్లతో అమరావతి జోన్-7,10 లే అవుట్ల రోడ్ల నిర్మాణం..
రాష్ట్ర రాజధాని అమరావతి జోన్-7 మరియు 10 లే అవుట్ల రోడ్ల నిర్మాణ పనులను రూ.2,723 కోట్లతో చేపట్టేందుకు సీఆర్డీఏ ఆమోదం తెల్పినట్లు మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్దికై ఇప్పటి వరకూ రూ.47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. మిగిలిన అభివృద్ది పనుల్లో కొన్నింటికి ఈ నెలాఖరు లోపు, మిగిలిన వాటికి వచ్చేనెలలోపు ఆమోదం తెల్పి, వచ్చే నెల 15 వ తేదీలోగా అన్ని పనులకు టెండర్లు పిలిసి పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
అమరావతి అభివృద్ది వ్యయాన్ని ప్రజలపై వేయడం లేదు..
ఏ దేశానికైనా, రాష్ట్రానికి కైన ఒక రాజధాని తప్పని సరిగా ఉంటుందని, అదే విధంగా అంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది పర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్దికి అయ్యే వ్యయా భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. పూలింగ్ ద్వారా రైతుల నుండి సేకరించిన భూములు అమ్మగా వచ్చే సొమ్ముతోనే అమరావతి అభివృద్దికై తీసుకున్న రుణాలు తీర్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ఈ విషయంలో ఎటువంట అపోహలకు తావులేదని, ఎవరు ఎటు వంటి వివర్శలు చేసిన ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానం అభివృద్ది పర్చేందుకు 2014-19 మద్య కాలంలోనే తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన పలు కేంద్ర సంస్థలను సమానంగా అన్ని జిల్లాలకు కేటాయించడం జరిగిందన్నారు. విజయనగం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని, విశాఖ జిల్లాకు ఐఐఎం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & అనర్జీ ను, కాకినాడకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ను, తాడేపల్లి గూడానికి నిట్ ను, మంగళగిరికి ఎయిమ్స్ ను, విజయవాడకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తిరుపతికి ఐఐటి, ఐజర్ లను, కర్నూలుకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ & మ్యాన్యుప్రాక్చరింగ్ సంస్థను, అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేటాయించడం జరిగిందన్నారు. ఇదే విధంగా విశాఖపట్నంలో టిసిఎస్, గుగూల్ వంటి సంస్థలతో పాటు గత ప్రభుత్వం తరమేసిన లూలూ గ్రూప్ ను మళ్లీ వెనక్కు తీసుకువస్తున్నామన్నారు. కర్నూలులో 350 ఎకరాల్లో డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు, రాయలసీమ జిల్లాల్లో మ్యాన్యుప్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. అవకాశం ఉన్న చోటల్లా పోర్టులను అభివృద్ది పర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోర్టులు అభివృద్ది అయ్యే ప్రతి చోటా అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా శాటిలైట్ సిటీలను అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.