పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది. 24వ తేదీ సాయంత్రంలోపు గౌరవ వేతనాలు చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు బుధవారం విడుదల చేశారు. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.50.50,80,000ను రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల ఖాతాలో వేసింది. దీంతో ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5,000 చొప్పున ఒకొక్కరికి 12 నెలల మొత్తం రూ.60,000 అందించింది.