విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By - Knakam Karthik |
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయవాడలో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కార్పోరేషన్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా చేసిన వ్యవహరించిన పాలక వర్గంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో విజయవాడ నగర పాలక సంస్థ పాలకవర్గం తీరును తప్పు పట్టింది. డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను పాలకవర్గం పాటించలేదు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8వ తేదీన తీర్మానం చేసింది. ఈ మేరకు వైసీపీ ఛైర్‌పర్సన్, మేయర్ భాగ్యలక్ష్మి నేతృత్వంలోని పాలకవర్గం ఈ తీర్మానం చేశారు. అయితే కార్పోరేషన్‌లో వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కాగా ఈ ఏడాది అక్టోబర్ 8 న చేసి పంపిన తీర్మానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విజయవాడలోని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 30 న విడుదలచేసిన జీవో 753 అమలు చేయాలని నిర్దేశం చేసింది. నగర పాలక సంస్థ వాటా నిధులతో మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.