అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు రిలీజ్ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అయితే, భౌతిక, జీవశాస్త్రం పేపర్లకు సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు ఉంటుంది. ఈ షెడ్యూల్ ఆధారంగా విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధం కావాలి.