నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు..ఐదు రోజులు ఆ సేవలు రద్దు
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభంకానున్నాయి
By - Knakam Karthik |
నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు..ఐదు రోజులు ఆ సేవలు రద్దు
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 2వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయ పుష్కరిణిలో ప్రతిరోజూ రాత్రి 7:00 గంటల నుంచి 8:00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
మొదటి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పపై 3 చుట్లు విహరిస్తారు, రెండవ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి 3 చుట్లు తిరుగుతారు. చివరి మూడు రోజులు (ఫిబ్రవరి 28 - మార్చి 2): శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు మొదటి రోజు 3 చుట్లు, రెండో రోజు 5 చుట్లు, చివరి రోజు 7 చుట్లు విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.
సేవల రద్దు:
ఈ ఉత్సవాల కారణంగా తిరుమలలో కొన్ని ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ఈ వేడుకల కోసం పుష్కరిణిని రంగురంగుల విద్యుత్ దీపాలు మరియు పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని TTD భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.