నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా స్పిల్‌వే నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వరకు నీరుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215. 80 టీఎంసీలకు ప్రస్తుతం 203.40 టీఎంసీల నీరు నిలువ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 65,972 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. విద్యుదుత్పత్తి కోసం 10 గేట్లు ఎత్తి 16,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.44 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.