ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on  12 Feb 2024 3:29 AM GMT
Special status, AndhraPradesh, Congress, YS Sharmila

ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్‌ షర్మిల 

ఏపీ: రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ఎన్నికలప్పుడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పడం కాదన్నారు. వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకోవడం, యువత బంగారు భవిష్యత్తు కోసం పనిచేయడం, రైతును రాజు చేయడం, మహిళలకు స్వయం సమృద్ధి కల్పించడం కానీ జగనన్న ప్రభుత్వం ఇవన్నీ గాలికొదిలేసి కేంద్రంలో ఉన్న బీజేపీతో డ్యూయేట్లు పాడుతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం జగనన్న, చంద్రబాబు కృషి చేసింది లేదని అన్నారు. ఆంధ్రరాష్ట్రానికి మేలు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

''జలయజ్ఞం వైఎస్సార్ కలల ప్రాజెక్ట్. రాష్ట్రంలో 54 ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టి 12 ప్రాజెక్టులు పూర్తి చేశారు వైఎస్‌ఆర్‌ . పెండింగ్ లో ఉన్న 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని జగనన్న ఎన్నికల్లో హామీ ఇచ్చాడు.. తీరా అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టికూడా తీయలేదు.ఇక్కడ గాలేరు - నగరి ద్వారా సాగునీరు రావాల్సి ఉంది . ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే వేల ఎకరాల్లో సాగునీరు వచ్చేది. ఇదేనా వైఎస్‌ఆర్‌ ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇదేనా ఆయన సంక్షేమ పాలన కొనసాగించడం అంటే? అంతా దోపిడీ రాజ్యం. నియంత పాలన'' అంటూ షర్మిల ఫైర్‌ అయ్యారు.

Next Story