ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించనున్నారు. అయితే ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 44 శాతం, ద్వితీయ సంవత్సరంలో 18 శాతం మంది ఫెయిలయ్యారు.
రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. హైస్కూల్ ప్లస్ ఇంటర్ విద్యార్థులు 4542 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 12652 మంది, సెకండియర్ పరీక్షలు 2024 మంది రాయగా.. 690 మంది మాత్రమే పాసయ్యారు. మిగతా విద్యార్థులంతా ఫెయిలయ్యారు. పాసైన వారికంటే ఫెయిలైన విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అలాగే.. మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 22 వరకు అవకాశం కల్పించారు. ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా .. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.