వైసీపీ, టీడీపీలకు సోమువీర్రాజు సవాల్
కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం
By అంజి Published on 30 May 2023 1:30 PM ISTవైసీపీ, టీడీపీలకు సోమువీర్రాజు సవాల్
కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సవాల్ విసిరిన సోము వీర్రాజు.. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రానివి అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయడం తప్ప రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అభిప్రాయపడ్డారు.
తొమ్మిదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఏ దశలోనూ చర్చకు సిద్ధమని, రాష్ట్ర అభివృద్ధిపై డేటాతో రావాలని కోరారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆరోపిస్తూ అభివృద్ధి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశంపై సోము వీర్రాజు స్పందిస్తూ.. కేంద్రం రూ. టీడీపీ హయాంలో రూ.15వేల కోట్లు, రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో చేశారని అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి తన ఉదారతను చాటుకుందన్నారు. ప్రపంచ దేశాల నేతలకు మోదీ బాస్‌లా మారారన్నారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందన్నారు.