పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు. కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ పరిణామాలపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎక్కడికీ పారిపోనని చెప్పావ్ మరి ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదేమని ప్రశ్నించారు. పులిని అన్నావ్, తొడ కొట్టావ్, ఇప్పుడు ఎక్కడికి పోయావు? పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. పోలీసులు విచారణకు పిలిస్తే కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారని, విచారణకు హాజరుకావచ్చు కదా అని సలహా ఇచ్చారు. నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడని ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్ వేశారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి కాకాణి కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.